Sathupalli: తెలంగాణ సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరవలేనిది..మంత్రి
Sathupalli: సత్తుపల్లి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మట్టా రాగమయి.
Sathupalli: తెలంగాణ సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరవలేనిది..మంత్రి
Sathupalli: సత్తుపల్లి పట్టణంలో మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ, బాపూజీకి ఎంతటి ప్రతిష్ట ఉందో, తెలంగాణ సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర కూడా అంత ఉంది.
ఆయన తన జీవితాంతం చేనేత కార్మికుల కోసం, తెలంగాణ ప్రజాస్వామ్యం కోసం పోరాడారు, ఆయన తెలంగాణ వచ్చే వరకు ఎలాంటి రాజకీయ పదవులు చేపట్ట లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బాపూజీ పేరు మీద ఒక యూనివర్సిటీని (ఐ.ఐ.హెచ్.టి.) తీసుకొచ్చాము, దీని ద్వారా అన్ని కులాల పిల్లలకు కొత్త టెక్నాలజీలో ఉచితంగా శిక్షణ దొరుకుతుంది మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత కార్మికులకు ఆధునిక సాంకేతికతను నేర్పిస్తూ, ప్రభుత్వం తరఫున వారికి పూర్తి సహకారం అందిస్తున్నాం.
మహిళా సంఘాల ద్వారా చీరల కొనుగోలు బాధ్యతను ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేస్తున్నాం శ్రీరామపురం, ,బేతుపల్లి చెరువులు మరియు వేశ్యకాంతల చెరువు ద్వారా దమ్మపేట, సత్తుపల్లి, వైరా, వేంసూరు మండలాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల తీవ్రమైన కష్టాలు వచ్చే అవకాశం ఉంది.
రిజర్వాయర్లలో నీరు లేని కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు, ఉద్యానవన పంటలు మరియు పామాయిల్ తోటలను కాపాడుకోవాలి కరెంట్ మరియు నీటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ సూర్యఘర్ పథకం ద్వారా అందరూ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలి. సొంత నియోజకవర్గమైన ఫుడ్ పార్కు పనులు, పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం, టూరిజం అభివృద్ధి వంటి కార్యక్రమాలను వేగవంతం చేసి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాను
ఈ కార్యక్రమములో మంత్రి తుమ్మలతో పాటు స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్ విజయ్ కుమార్ మరియు రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి తో పాటు ఆ సంఘ నాయకులు సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, తుమ్మల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




