Julurupadu: ఆత్మీయ మిత్రుడి ఇంటికి వెళ్లిన మంత్రి తుమ్మల!

Julurupadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాలకొల్లులో తన చిరకాల మిత్రుడు రోకటి రంగారావు నివాసానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా వెళ్లి పరామర్శించారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 19 Oct 2026 5:02 PM IST
Julurupadu
X

Julurupadu: ఆత్మీయ మిత్రుడి ఇంటికి వెళ్లిన మంత్రి తుమ్మల!

జూలూరుపాడు: తన ఆత్మీయ మిత్రుడు నివాసానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు మధ్యాహ్నం ఆకస్మికంగా వెళ్ళినారు. జూలూరుపాడు టన్నల్ పనులను పరిశీలించటానికి వెళుతూ జూలూరుపాడు సమీపంలోని పాలకొల్లు గ్రామంలో నివాసం ఉంటున్న రోకటి రంగారావు నివాసానికి ఆకస్మికంగా వెళ్లి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి రాజకీయ రంగ ప్రవేశం నాటి నుంచి నేటి వరకు కూడా రంగారావు మంత్రి తుమ్మల తోనే ప్రయాణం సాగిస్తున్నారు. ఆరోగ్య రీత్యా మంత్రి తుమ్మలను కలవలేక పోతున్న రంగారావు గారి నివాసానికి మంత్రి ఆకస్మికంగా వెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండాపోయింది.మంత్రి తుమ్మలతో చాలాసేపు ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల వెంట వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ తో పాటు వైరా నియోజకవర్గ సీనియర్ నాయకులు, తుమ్మల అభిమానులు ఉన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU