Aswaraopeta: ఆయిల్‌పామ్ రైతుల విద్యుత్ లైన్ల సమస్యకు మంత్రి తుమ్మల పరిష్కారం!
Aswaraopeta: ఆయిల్‌పామ్ తోటల్లో బహిరంగ విద్యుత్ తీగల స్థానంలో ఏబీ కేబుల్స్ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్, భట్టి దృష్టికి తీసుకెళ్లారు.
Aswaraopeta: ఆయిల్‌పామ్ రైతుల విద్యుత్ లైన్ల సమస్యకు మంత్రి తుమ్మల పరిష్కారం!
భద్రాద్రికొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట: వ్యవసాయ రంగంలో ఆయిల్ ఫామ్ సాగు వేగంగా దూసుకుపోతున్న తరుణంలో సాగుకు మరింత మద్దతుగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆయిల్ ఫామ్ తోటల్లో విద్యుత్ వైర్ల సమస్యకు వినూత్న ప్రతిపాధన
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ లైన్ల కారణంగా ఆయిల్‌పామ్ తోటల్లో మొక్కల సంఖ్య తగ్గుతోందని తెలిపారు. దీనివల్ల ఎకరాకు 6 నుంచి 8 మొక్కలు నాటే అవకాశాన్ని అన్నదాతలు కోల్పోతున్నారని చెప్పుకొచ్చారు.
ఏ బి కేబుల్స్ వినియోగం ద్వారా ఆయిల్ ఫామ్ తోటల్లో విద్యుత్ తీగల వల్ల వచ్చే ప్రమాదాలు, పవర్ కట్ సమస్యని పరిష్కరించవచ్చని చూచించారు...
35 ఏళ్లలో రూ.27.45 లక్షల స్థూల ఆదాయం..
ఏబీ కేబుల్స్ ఏర్పాటుతో సాగు భూమిని పూర్తిస్థాయిలో వినియోగించడానికి అవకాశం ఉంటుందని మంత్రి తుమ్మల వివరించారు. నిర్మల్ జిల్లా కనకాపూర్‌లో క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ సమస్య వెలుగులోకి వచ్చిందని అన్నారు. 20 ఆయిల్‌పామ్ మొక్కల ద్వారా 35 ఏళ్లలో రూ.27.45 లక్షల స్థూల ఆదాయం వస్తుందని చెప్పుకొచ్చారు. విద్యుత్ లైన్‌ను ఏబీ కేబుల్‌గా మార్చేందుకు అయ్యే ఖర్చు కేవలం రూ.1.45 లక్షలని తెలిపారు. ఏబీ కేబుల్స్‌తో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్లు, అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని అన్నారు.
రైతులకు అదనపు ఆదాయం..
అన్నదాతలపై భారం పడకుండా సబ్సిడీ లేదా ఛార్జీల మినహాయింపునకు ప్రతిపాదన చేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. డిస్కంల స్టోర్ల ద్వారా నాణ్యమైన ఏబీ కేబుల్స్‌ను సరఫరా చేయాలని సూచించారు. విద్యుత్, ఉద్యాన శాఖల సమన్వయంతో తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ లైన్లను గుర్తిస్తున్నామని తెలిపారు. దీనివల్ల ఆయిల్‌పామ్ రైతులకు అదనపు ఆదాయం వస్తుందని వివరించారు. వ్యవసాయ కార్మికులకు మెరుగైన భద్రతే తమ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.




