Sathupalli: కొండ్రుపాడులో బాధిత కుటుంబాలకు మంత్రి తుమ్మల పరామర్శ!
Sathupalli: సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం కొండ్రుపాడులో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.
Sathupalli: కొండ్రుపాడులో బాధిత కుటుంబాలకు మంత్రి తుమ్మల పరామర్శ!
సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం పెనుబల్లి మండల పరిధిలోని కొండ్రుపాడు గ్రామములో ఇటీవల మరణించిన బాధిత కుటుంబాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు మధ్యాహ్నం పరామర్శించారు. కిష్టారం గ్రామానికి చెందిన మాచినేని నరేందర్ కుమార్ తల్లి గారు అయిన మాచినేని నరసమ్మ గారు గత వారం క్రితం స్వర్గస్తులైనారు.
ఈరోజు స్వర్గీయ మాచినేని నరసమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన యలమంచిలి రామచంద్రయ్య గారు ఇటీవల స్వర్గస్తులైనారు.
ఈరోజు స్వర్గీయ ఎలమంచిలి రామచంద్రయ్య గారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల తో పాటు మండల సీనియర్ నాయకులు, కొండ్రుపాడు గ్రామ ప్రజలు తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.




