Khammam: అర్నభ్ తుఫానుపై మంత్రి తుమ్మల టెలికాన్ఫరెన్స్!
Khammam: అర్నభ్ తుఫాను నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, సహాయక చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
Khammam: అర్నభ్ తుఫానుపై మంత్రి తుమ్మల టెలికాన్ఫరెన్స్!
ఖమ్మం: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు సాయంత్రం ఆర్నబ్ తుఫానుపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లతో చరవాణి ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్ర ప్రాంత సరిహద్దు ఎక్కువగా ఉండటంతో జిల్లాలో ఈ తుఫాను పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వర్షపాత వివరాలతో పాటు ఇతర అంశాలపై మంత్రి తుమ్మల కలెక్టర్లతో మాట్లాడినారు. తీరం దాటేనా.. ఈ తుఫాన్ ప్రభావం ఈరోజు రాత్రి మరింతగా ఎక్కువగా ఉంటుంది. అని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో మంత్రి తుమ్మల కలెక్టర్లకు కీలక ఆదేశాలు మరియు సూచనలు చేశారు.




