Khammam: చినజీయర్ స్వామిని ఆహ్వానించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు!
Khammam: ఖమ్మంలో అక్టోబర్ 12న జరగనున్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమిపూజకు చిన్న జీయర్ స్వామిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు.
Khammam: చినజీయర్ స్వామిని ఆహ్వానించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు!
ఖమ్మం: ఖమ్మం నగరంలో ఈ నెల 12వ తేదీన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా జరగనున్న TTD ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్ గారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి శుభారంభం కానున్న ఈ పవిత్ర కార్యక్రమం ఖమ్మం నగర ఆధ్యాత్మిక చరిత్రలో ఒక విశిష్ట ఘట్టంగా నిలవనుంది.




