Bhadrachalam: ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: మంత్రి పొంగులేటి!

Bhadrachalam: ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: భద్రాచలంలో నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్హులందరికీ విడతల వారీగా ఇళ్ల మంజూరు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Updated on: 23 Sept 2026 5:01 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: మంత్రి పొంగులేటి!

భద్రాచలం సెప్టెంబర్ 23: పేద మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

బుధవారం భద్రాచలం అంబ సత్రం మార్గంలోని కాలనీలో లబ్ధిదారు మామిడి మౌనిక నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్‌, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు లతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పించి వారి జీవితాల్లో ఆనందం నింపాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. అర్హత ఉన్న పేదలందరికీ మూడో విడతలో, అవసరమైతే నాలుగో విడతలోనూ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem