Ashwaraopeta: అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన పొంగులేటి

Ashwaraopeta: అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి అండర్-20 బాలికల కబడ్డీ పోటీలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి బతుకమ్మ ఆడారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 10 Oct 2026 11:50 PM IST
Ashwaraopeta
X

Ashwaraopeta: అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన పొంగులేటి

అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్-20 బాలికల కబడ్డీ పోటీలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.మంత్రి పొంగులేటి, ఖమ్మం ఎంపీ రఘురాం, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ,కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ PO రాహుల్ క్రీడా ప్రాంగణంలోఏర్పాట్లు చేసిన బతుకమ్మలను పరిశీలించి క్రీడాకారులు, స్థానికులతో కలిసి బతుకమ్మలాడారు.

అనంతరం టాస్ వేసి కబడ్డీ పోటీలు ప్రారంభించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పోటీలకు వచ్చిన ముప్పై నాలుగు జట్ల క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు.

దేశంలో ఏ ఆట జరిగినా మొదటిh బహుమతి తెలంగాణకే రావాలనే లక్ష్యంతో క్రీడలకు, క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక క్రీడాకారుడని అశ్వరావుపేట ఎమ్మెల్యే సైతం వ్యాయామ ఉపాధ్యాయుడు అని గుర్తు చేశారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA