Khammam: రేజర్ల దేవస్థానంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించిన మంత్రి పొంగులేటి!

Khammam: ఖమ్మం జిల్లా రేజర్ల దేవస్థానంలో శివాద్రి గిరి ప్రదక్షిణను లాంఛనంగా ప్రారంభించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రత్యేక పూజలు!

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Oct 2026 4:47 PM IST
Khammam
X

Khammam: రేజర్ల దేవస్థానంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించిన మంత్రి పొంగులేటి!

Khammam: గణేష్ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రదక్షిణను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగింది.

దేవస్థానానికి చేరుకున్న మంత్రి పొంగులేటికి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ ఘన స్వాగతం పలికారు.

విజయదశమి పర్వదినం సందర్భంగా మంత్రి పొంగులేటి భక్తులకు, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామివారి దర్శనం, శివాద్రి గిరి ప్రదక్షిణతో రేజర్ల దేవస్థానంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్