Sattupalli: గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలి!
Sattupalli: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 72వ రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు. విజేత నల్లగొండ జట్టుకు ట్రోఫీ అందజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
Sattupalli: గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలి!
Sattupalli: క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమని.. మనం క్రీడా స్ఫూర్తిని మాత్రమే పెంపొందించుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మువ్వా యూత్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న 72వ రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీలను శుక్రవారం నిర్వహించగా.. మంత్రి పొంగులేటి తన సతీమణి మాధురితో కలిసి హాజరై.. ఖమ్మం- రంగారెడ్డి సెమీఫైనల్స్, ఆ తర్వాత రంగారెడ్డి - నల్లగొండ ఫైనల్స్ మ్యాచ్ లను వీక్షించారు. విజేతగా నిలిచిన నల్లగొండ జట్టుకు ట్రోఫీ బహుకరించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ టీజీఐడిసి మాజీ చైర్మన్ మూవ్వా విజయబాబు ఈ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి విజయవంతం చేశారని అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేలా.. మన రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పాలసీ తీసుకొస్తోందని, క్రీడాకారులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అభయమిచ్చారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు, టీజీ ఐడిసి మాజీ చైర్మన్ మువ్వ విజయబాబు, పలువురు ప్రజాప్రతినిధులు, టోర్నీ నిర్వాహకులు, నాయకులు పాల్గొన్నారు.




