Palair: నేలకొండపల్లిలో చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి
Palair: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లబ్ధిదారులకు చేయూత పెన్షన్ పత్రాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేసి, మిగిలిన హామీలు త్వరలో అమలు చేస్తామన్నారు.
Palair: నేలకొండపల్లిలో చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి
పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో లబ్ధిదారులకు చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ తో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మందికి చేయూత పింఛన్ మంజూరి చేయడం జరిగిందని అన్నారు. నా సొంత నియోజకవర్గం అయినా పాలేరులోని నేలకొండపల్లి మండలంలోనే నూతనంగా 1138 మందికి చేయూత పెన్షన్ అందించడం జరిగిందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేయూత పెన్షన్ తో పాటు అనేక సంక్షేమ పథకాలను కూడా అందిస్తున్నామని అన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్న మేము ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో లో మిగిలిన రెండు హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. ఇంకా ఎవరైనా అర్హులైన వారు ఉంటే వారికి కూడా చేయూత పెన్షన్ ఇస్తామని అన్నారు.




