Palair: పాలేరులో ఘనంగా 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి': పాల్గొన్న పొంగులేటి

Palair: పాలేరు నియోజకవర్గంలో 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు కానుకలు అందజేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 8 Nov 2026 4:11 PM IST
Palair
X

Palair: పాలేరులో ఘనంగా 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి': పాల్గొన్న పొంగులేటి

పాలేరు: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పండుగలా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఖమ్మం రూరల్ లో పర్యటించి, గృహ ప్రవేశాలు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి మంత్రి దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి దీపావళి శుభాకాంక్షలు తెలిపి వారికి చిరు కానుకలను అందించారు. అదేవిధంగా మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి సెల్ఫీ ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.