Palwancha: పాల్వంచలో జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడిన మినీ వ్యాన్!

Palwancha: పాల్వంచలో అదుపుతప్పి బోల్తాపడిన మినీ వ్యాన్. ఐదు బైక్‌లు ధ్వంసం, ఎవరికీ గాయాలు కాకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. భద్రాచలం జాతీయ రహదారిపై ఘటన.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 12 Oct 2026 7:56 PM IST
Palwancha
X

Palwancha: పాల్వంచలో జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడిన మినీ వ్యాన్!

Palwancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఇందిరా కాలనీ పెట్రోల్ బంక్ సమీపంలో భద్రాచలం జాతీయ రహదారిపై మినీ వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో అక్కడ నిలిపి ఉంచిన ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఎవరికీ గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

స్థానికుల కథనం ప్రకారం కొత్తగూడెం సింగరేణి ప్రాంతం నుంచి మణుగూరు వైపు కన్వేయర్‌ బెల్ట్‌ కింద ఉపయోగించే రోలర్లను మినీ వ్యాన్‌లో తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అడ్డుగా రావడంతో డ్రైవర్‌ వ్యాన్‌ను అదుపు చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో వ్యాన్‌లో ఉన్న రోలర్లు బ్యాలెన్స్‌ తప్పడంతో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాల మెకానిక్‌ షెడ్‌ ఎదుట నిలిపి ఉంచిన బైక్‌లపై బోల్తాపడింది.

వ్యాన్‌ చక్రాల కింద ద్విచక్ర వాహనాలు ఇరుక్కుపోవడంతో వాహనం అక్కడే నిలిచిపోయింది. ఈ ఘటనలో ఐదు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాద సమయంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రద్దీగా ఉండే జాతీయ రహదారి పక్కన ఈ ఘటన చోటుచేసుకోవడంతో కొద్దిసేపు అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN