Burgampahad: సారపాక ప్రధాన రహదారిపై తృటిలో తప్పిన ప్రమాదం!

Burgampahad: సారపాక ప్రధాన రహదారిపై అదుపుతప్పిన పాల వాహనం డ్రైన్‌లోకి దూసుకెళ్లింది. విద్యుత్ స్తంభానికి సమీపంలో నిలవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

G Ravi, Bhadradri
Published on: 25 Oct 2026 7:16 AM IST
Burgampahad
X

Burgampahad: సారపాక ప్రధాన రహదారిపై తృటిలో తప్పిన ప్రమాదం!

Burgampahad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన రహదారిపై తృటిలో ప్రమాదం తప్పింది. సారపాకలోని భవిత బుక్స్ షాప్ సమీపంలో పాల వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న డ్రైన్‌లోకి దిగబడిపోయింది.

వాహనం మరికొంత ముందుకు వెళ్లి ఉంటే విద్యుత్ స్తంభాన్ని ఢీకొనే ప్రమాదం ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఒకవైపు అధికారులు వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటించాలని సూచిస్తున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన రహదారులపై వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వేగ నియంత్రణ పాటించాలని సూచిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri