Kothagudem: కొత్తగూడెంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ ప్రారంభించిన మేయర్!

Kothagudem: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పరిశుభ్రత లక్ష్యంగా మేయర్ మూడ్ గణేష్ ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను ప్రారంభించి, క్షేత్రస్థాయి పనులను పరిశీలించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 26 Oct 2026 5:21 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ ప్రారంభించిన మేయర్!

Kothagudem: పరిశుభ్రత లక్ష్యంగా కొత్తగూడెం కార్పొరేషన్ లో స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. కాల్వల పూడికతీత ముమ్మరంగా చేపడుతున్నామని, డివిజన్లలో మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని మేయర్ మూడ్ గణేష్ తెలిపారు.

కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు సమగ్ర కార్యాచరణతో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ ప్రారంభించినట్లు మేయర్ తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ పరిధిలోని అన్ని డివిజన్లలో సోమవారం క్షేత్రస్థాయిలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు.

నగర ప్రజారోగ్యాన్ని కాపాడటంలో శానిటేషన్ విభాగం పనితీరు అత్యంత కీలకమని, బస్తీలు, వీధుల్లో నిల్వ ఉన్న చెత్త చెదారాన్ని వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధుల్లో పేరుకుపోయిన ముళ్లపొదలను పూర్తిగా తొలగించి రోడ్లను శుభ్రంగా ఉంచాలని సూచించారు. మురుగునీరు నిలవకుండా నిరంతరం కాల్వల్లో పూడికతీత పనులు వేగవంతం చేయాలని, కాల్వలపై అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దని హెచ్చరించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM