Aswapuram: అశ్వాపురం మండల కేంద్రంలో రెండు ఆలయాల్లో భారీ చోరీలు

Aswapuram: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని ఓంశక్తి, సాయిబాబా ఆలయాల్లో దొంగలు పడి భారీగా బంగారం, వెండి ఆభరణాలు అపహరించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 13 Nov 2026 3:56 PM IST
Aswapuram
X

Aswapuram: అశ్వాపురం మండల కేంద్రంలో రెండు ఆలయాల్లో భారీ చోరీలు

అశ్వాపురం: మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. భక్తుల ఆరాధ్య దైవాల ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని రెండు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మండల కేంద్రంలోని ఓంశక్తి ఆలయంలో సుమారు 8 కేజీల వెండి, దాదాపు 16 తులాల బంగారం అపహరణకు గురైనట్లు సమాచారం.

అదేవిధంగా సాయిబాబా ఆలయంలోనూ సుమారు 2 కేజీల వెండితో పాటు హుండీని పగలగొట్టి అందులోని నగదును దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA