Manuguru: మణుగూరులో రూ.14.70 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Manuguru: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రూ.14.70 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
Manuguru: మణుగూరులో రూ.14.70 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మణుగూరు: మణుగూరు మండలానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) లబ్ధిదారులకు రూ.14 లక్షల 70 వేల రూపాయల విలువైన చెక్కులను పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు, ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్స పొందలేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని మెరుగైన వైద్యం పొందాలని లబ్ధిదారులకు సూచించారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు కురం రవి ముదిరాజ్, సర్పంచులు కలబోయిన మాధవరావు, మడకం క్రిష్ణ, S గణేష్ రెడ్డి, జిల్లా ముఖ్య నాయకులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




