Manuguru: మంత్రులను విమర్శించే నైతిక అర్హత రేగా కాంతారావుకు లేదు: కాంగ్రెస్ ధ్వజం!
Manuguru: ప్రజా ప్రభుత్వం, మంత్రులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బహిరంగ క్షమాపణ చెప్పాలని మణుగూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పీర్నాకి నవీన్ డిమాండ్ చేశారు.
Manuguru: మంత్రులను విమర్శించే నైతిక అర్హత రేగా కాంతారావుకు లేదు: కాంగ్రెస్ ధ్వజం!
మణుగూరు: ఈరోజు మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల అధ్యక్షుడు పీర్నాకి నవీన్ మాట్లాడుతూ పెనుపాక నియోజకవర్గం అభివృద్ధి పనులు సరవెగంగా సాగుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సమయంలో ఉన్నటువంటి ఇసుక ర్యాంపులే వారి సమయంలో చేసిన దందాల వల్ల నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లన్నీ పాడైపోయి గుంతలు ఏర్పడి సర్వ నాశనం అయ్యాయి వాటిని ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు గారు కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి,
రోడ్డు పనులు మొదలుపెట్టేయడానికి ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రారంభించాలని ప్రయత్నిస్తుంటే అవన్నీ ఆయన ఖాతాలో వేసుకోవాలని ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా ప్రజా ప్రభుత్వం పై మంత్రులపై ప్రజాప్రతినిధులపై దుష్ప్రచారాన్ని చేయడం సిగ్గుమాలిన పని ఏఐ టెక్నాలజీ ద్వారా రోడ్డు బొమ్మలు పెట్టి ప్రజలను సోషల్ మీడియా ద్వారా మోసం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా బూర్గంపాడు మండలం నుంచి పినపాక మండలం దిగినేపల్లి వరకు ఆర్ అండ్ బి రోడ్డు పనులు ప్రారంభం అవుతున్నాయని,
తెలుసుకొని మెప్పుకోసం పాకలాడుతున్న మాజీ నోరు అదుపులో పెట్టుకోవాలి వెంటనే బే షరతుగా రాష్ట్ర మంత్రులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే మీ యొక్క పర్యటనలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి రహీంపాషా, శివాలయం గుడి చైర్మన్ కూచిపూడి బాబు, సీనియర్ నాయకులు జీవి, సిరపు గణేష్ రెడ్డి,టౌన్ నాయకులు చప్పిడి రామసుబ్రహ్మణ్యం లు పాల్గొన్నారు.




