Vemsoor: వేంసూరులో ఘరానా మోసం ఫోన్ ఎత్తుకెళ్లి రూ.50 వేలు కాజేసిన వైనం!

Vemsoor: ఖమ్మం జిల్లా వేంసూరులో పుస్తకాలు కొనే बहाనాతో దుకాణదారుడి ఫోన్ నంబర్ పిన్ తెలుసుకుని, ఫోన్ ఎత్తుకెళ్లి రూ.50,000 కాజేసిన ఘరానా మోసం వెలుగుచూసింది.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 2 Oct 2026 9:53 AM IST
Vemsoor
X

Vemsoor: వేంసూరులో ఘరానా మోసం ఫోన్ ఎత్తుకెళ్లి రూ.50 వేలు కాజేసిన వైనం!

Vemsoor: ఖమ్మం జిల్లా వేంసూరు లో పుస్తకాలు కొంటానని నమ్మించి,చాకచక్యంగా స్మార్ట్‌ఫోన్ పిన్ నంబర్‌ తెలుసుకుని, ఆపై ఫోన్‌తో ఉడాయించి బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసిన ఘరానా మోసం వేంసూరు సెంటర్‌లో వెలుగుచూసింది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం వేంసూరు సెంటర్‌లోని ఓ పుస్తకాల దుకాణానికి ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి పుస్తకాలు కావాలని అడిగాడు.వ్యాపారి వాటిని తీసి చూపిస్తుండగా, "నా స్నేహితుడికి ఫోన్‌పే (PhonePe) ద్వారా ఒక్క రూపాయి పంపండి, ఆ మొత్తాన్ని ఆయన వెంటనే మీకు తిరిగి పంపుతాడు" అని నమ్మబలికాడు.వ్యాపారి నిజమేనని నమ్మి రూ.1 పంపేందుకు తన మొబైల్‌లో యూపీఐ పిన్ (UPI PIN) నమోదు చేస్తుండగా, సదరు వ్యక్తి చాకచక్యంగా గమనించాడు.

అనంతరం మరికొన్ని పుస్తకాలు కావాలని అడగడంతో దుకాణదారుడి భార్య లోపలికి వెళ్లింది. అదే సమయంలో వ్యాపారి కూడా పక్కనే ఉన్న షాపు వద్దకు వెళ్లగా, కౌంటర్‌పై ఉన్న స్మార్ట్‌ఫోన్‌‌ను ఆ వ్యక్తి జేబులో వేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. లోపలి నుంచి వచ్చిన వ్యాపారి భార్య ఫోన్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి చూసేలోపే ఘరానా మోసం జరిగిపోయింది.

ముందే చూసుకున్న పిన్ నంబర్ ఆధారంగా దుకాణదారుడి బ్యాంక్ ఖాతా నుంచి నిందితుడు మూడు విడతలుగా (రూ.20,000, రూ.20,000, రూ.10,000 చొప్పున) మొత్తం రూ.50,000 కాజేశాడు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు బ్యాంకు అధికారులను సంప్రదించడంతో, ఖాతాలో మిగిలి ఉన్న రూ.30,000 పోకుండా సకాలంలో ఖాతాను బ్లాక్ చేశారు.డిజిటల్ చెల్లింపుల్లో జాగ్రత్త అవసరం.వ్యాపారులు,వినియోగదారులు డిజిటల్ లావాదేవీలు నిర్వహించేటప్పుడు తమ యూపీఐ పిన్ నంబర్లను ఇతరులకు కనిపించకుండా అత్యంత గోప్యంగా ఉంచాలని,అపరిచితులు చెప్పే ఇలాంటి మాటలను నమ్మి లావాదేవీలు చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI