Ashwapuram: అశ్వాపురం మండలంలో బతుకమ్మ పూల కోసం వెళ్లిన వ్యక్తి మృతి!

Ashwapuram: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో బతుకమ్మ పూల కోసం వెళ్లిన కుర్సం లక్ష్మయ్య (57) చెరువులో మునిగి మృతి చెందాడు. కుటుంబంలో తీవ్ర విషాదం.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 19 Oct 2026 12:19 PM IST
Ashwapuram
X

Ashwapuram: అశ్వాపురం మండలంలో బతుకమ్మ పూల కోసం వెళ్లిన వ్యక్తి మృతి!

Ashwapuram: బతుకమ్మ పండుగ కోసం తామర పూలు సేకరించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని కాలువ బజార్‌కు చెందిన కుర్సం లక్ష్మయ్య (57) శనివారం మధ్యాహ్నం భద్రయ్య కుంట వద్దకు తామర పూలు సేకరించేందుకు వెళ్లాడు.

ఈ క్రమంలో చెరువులోకి దిగి పూలు కోస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయినట్లు బంధువులు తెలిపారు. లక్ష్మయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన బంధువులు చెరువు పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.

ఆదివారం ఉదయం చెరువులో ఆయన మృతదేహం తేలి కనిపించడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనతో కాలువ బజార్‌లో విషాదఛాయలు అలముకున్నాయి.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA