Khammam: ఖమ్మం మలబార్ గోల్డ్‌లో ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన ప్రారంభం!

Khammam: ఖమ్మం మలబార్ గోల్డ్‌లో బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన ప్రారంభం. అక్టోబర్ 11 నుండి 20 వరకు ప్రత్యేక రాయితీలు, లైఫ్‌టైమ్ మెయింటెనెన్స్ ఆఫర్లు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 11 Oct 2026 7:09 PM IST
Khammam
X

Khammam: ఖమ్మం మలబార్ గోల్డ్‌లో ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన ప్రారంభం!

Khammam: మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఖమ్మం షోరూంలో ప్రత్యేక బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శనను దొరేపల్లి శ్వేత , డాక్టర్ రాధిక , రజితలు ఘనంగా ప్రారంభించారు . అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని అన్నారు . ఈ ప్రదర్శనలో బంగారు , వజ్ర , రత్నాభరణాల ప్రత్యేక కలెక్షన్లను అందుబాటులో ఉంచారు. మైన్, ఎరా, ప్రెష్యా , ఎత్నిక్స్ , డివైన్ , స్టార్లెట్ బ్రాండ్ల ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి అని తెలిపారు . వివాహాలు , పార్టీలు , సంప్రదాయ వేడుకలకు అనువైన విభిన్న డిజైన్లను ప్రదర్శించబడ్డాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్టోర్ హెడ్ జితిన్ వి.కె. , స్టోర్ మేనేజర్ గుజ్జ కిషన్ రావు , అసిస్టెంట్ మేనేజర్లు విష్ణు , విజయ్ , మార్కెటింగ్ మేనేజర్ రుద్ర రామకృష్ణ లు మాట్లాడుతూ , వినియోగదారులకు పారదర్శక ధరలు , జీవితకాల ఉచిత నిర్వహణ వంటి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రూ.20 వేలకుపైగా కొనుగోళ్లపై ఏడాది ఉచిత బీమా , జీవితకాల ఉచిత నిర్వహణతో పాటు , ఆభరణాల తరుగు చార్జీలపై 30 శాతం వరకు , వజ్రాభరణాల్లో వజ్రాల విలువపై 30 శాతం వరకు రాయితీలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

పాత బంగారానికి 100 శాతం విలువ , బంగారం మార్పిడిపై తరుగు లేకుండా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు . 1993లో కేరళలో ప్రారంభమైన మలబార్ గోల్డ్ & డైమండ్స్ అంతర్జాతీయంగా విస్తరించిన ప్రముఖ ఆభరణాల సంస్థగా గుర్తింపు పొందిందని వారు వివరించారు . ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు , ఉన్నతాధికారులు , శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.