Khammam: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026 పోటీలను విజయవంతం చేయాలి: మయాంక్!

Khammam: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026 ఆర్చరీ పోటీల ఏర్పాట్లను సాయ్ డీడీజీ మయాంక్ శ్రీవాస్తవ మంగళవారం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో పరిశీలించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 24 Nov 2026 9:45 PM IST
Khammam
X

Khammam: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026 పోటీలను విజయవంతం చేయాలి: మయాంక్!

ఖమ్మం: ​జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్వహించి , విజయవంతం చేయాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మయాంక్ శ్రీవాస్తవ అన్నారు. జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026 జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల నిర్వహణకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మయాంక్ శ్రీవాస్తవ మంగళవారం స్థానిక సర్దార్ పటేల్ స్టేడియాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా స్టేడియంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, క్రీడా సామగ్రి, క్రీడాకారుల ప్రాక్టీస్ గ్రౌండ్‌తో పాటు ఆర్చరీ పోటీల నిర్వహణకు సిద్ధం చేస్తున్న ప్రధాన పోటీ ప్రాంగణాన్ని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ క్షుణ్ణంగా పరిశీలించారు. పోటీల నిర్వహణకు అవసరమైన మౌళిక సదుపాయాలు, క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రాక్టీస్, పోటీ ప్రాంగణాల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2026 జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, క్రీడా శాఖ సమన్వయంతో చేపడుతున్న పనులను అభినందించారు. జిల్లాలో ఇట్టి జాతీయ స్థాయి పోటీలను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సమన్వయంతో చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ & ఖమ్మం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నోడల్ అధికారి పారస్ కుమార్, ఖేలో ఇండియా డిప్యూటీ డైరెక్టర్ హరీశ్ బాబు, తెలంగాణ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ డాక్టర్ రఘు, వెన్యూ కోఆర్డినేటర్ రూపేష్ కుమార్, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి తుంబూరు సునీల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారీచేయనైనది.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.