Manuguru: అంటరానితనం, అసమానతలపై అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు పూలే!
Manuguru: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
Manuguru: అంటరానితనం, అసమానతలపై అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు పూలే!
Manuguru: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశ చరిత్రలో గొప్ప సంఘ సంస్కర్తగా, సామాజిక విప్లవకారుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న కులవివక్ష, అంటరానితనం, అసమానతలు, మూఢనమ్మకాలపై ఆయన అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు.
ముఖ్యంగా మహిళలకు విద్య అందించాలనే గొప్ప సంకల్పంతో తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికల విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు విద్య, సమాన హక్కులు, ఆత్మగౌరవం కల్పించేందుకు ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు.విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు నేటికీ ఎంతో ప్రాసంగికమని, ఆయన చూపిన బాటలో పయనిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజ అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ తొలేం కళ్యాణి, మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు కురం రవి ముదిరాజ్, జిల్లా ముఖ్య నాయకులు, ఆత్మా కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, యూత్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులర్పించారు.




