Bayyaram: నామాలపాడులో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు గ్రామపంచాయతీలో సర్పంచ్ దీప ప్రకాష్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.

NARASIMHARAO, BAYYARAM
Published on: 19 Oct 2026 10:45 AM IST
Bayyaram
X

Bayyaram: నామాలపాడులో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని నామాలపాడు గ్రామ పంచాయతీలో సర్పంచ్ దీప ప్రకాష్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ...తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలు,ఆడపడుచుల ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబురాల ఉత్సాహంగా నిర్వహించామని ప్రకృతిని పూల రూపంలో ఆరాధిస్తూ,సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మహిళలు సద్దులబతుకమ్మ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి,అందంగా అలంకరించి పండుగ సందడిని చాటిచెప్పారు.

ప్రకృతిని ఆరాధించే పూల పండుగ బతుకమ్మ!

బతుకమ్మ అంటే కేవలం పూలను పేర్చి ఆడుకునే పండుగ మాత్రమే కాదు..ప్రకృతితో మానవ జీవనానికి ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే గొప్ప సాంస్కృతిక వేడుక. తెలంగాణ నేలపై విరబూసే తంగేడు,గునుగు,బంతి తదితర పూలతో బతుకమ్మలను అందంగా పేర్చడం ఈ పండుగ ప్రత్యేకత. ప్రకృతి ప్రసాదించిన పూలను పూజిస్తూ,పచ్చదనం ప్రాధాన్యతను గుర్తుచేస్తూ తరతరాలుగా ఈ పండుగను జరుపుకుంటున్నారు.

ఆడపడుచుల ఆత్మీయతకు ప్రతీక.. బతుకమ్మ!

తొమ్మిది రోజులపాటు వివిధ రూపాల్లో బతుకమ్మను పూజిస్తూ మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ,చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల క్షేమం,ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తారు.కులమతాలకు అతీతంగా మహిళలంతా ఒకచోట చేరి జరుపుకునే ఈ వేడుకలు ఐక్యతకు,సోదరభావానికి,సామాజిక బంధాలకు ప్రతీకగా నిలుస్తాయి.

తెలంగాణ అస్తిత్వానికి ప్రతిబింబం..బతుకమ్మ!

తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పే పండుగల్లో బతుకమ్మకు విశిష్ట స్థానం ఉంది.తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు చేసే సందడి,మార్మోగే జానపద గీతాలు తెలంగాణ పల్లె సంస్కృతికి అద్దం పడతాయి.ఆధునిక కాలంలోనూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భావితరాలకు మన సంస్కృతి,వారసత్వాన్ని పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత.

భక్తి,ప్రకృతి ప్రేమ,కుటుంబ అనుబంధాలు,మహిళల ఐక్యత కలగలిసిన బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవనశైలిలో విడదీయలేని భాగంగా నిలుస్తోంది. సద్దుల బతుకమ్మతో ఈ సంబురాలు మరింత సందడ సాగినాయి.తెలంగాణ ఆడపడుచుల ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ పండుగ పల్లెల్లో పండుగ శోభను నింపుతోంది.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM