Julurupadu: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డికి మద్దతు!
Julurupadu: జూలూరుపాడులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరిన నేత లేళ్ల వెంకట్ రెడ్డి.
Julurupadu: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డికి మద్దతు!
Julurupadu: ఈరోజు జూలూరుపాడు మండల కేంద్రంలో నవోదయ కాంప్లెక్స్ నందు . త్వరలో జరగబోయే ఉమ్మడి ఖమ్మం -నల్గొండ -వరంగల్. జిల్లాల గ్రాడ్యుయేట్ MLC. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాoరెడ్డి సర్వోత్తo రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి కోరారు.
జిల్లా నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జూలూరుపాడు మండలంలో 2023లోపు గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ MLC. ఓటు నవోదయ కాంప్లెక్స్ నందు ఉచితంగా ఆన్లైన్ సెంటర్ నందు నమోదు చేసుకోవాలని కోరారు. అదేవిధంగా మన ప్రాంత ముద్దు బిడ్డ రాంరెడ్డి కుటుంబ వారసుడు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి ఒక మంచి విద్యావంతుడు, సమాజం పట్ల, పట్టభద్రుల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అని లేళ్ళ వెంకటరెడ్డి అన్నారు.
కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా, నవోదయ కాంప్లెక్స్ నందు ఈరోజు నుండి నవంబర్ ఆరోవ (6)తేదీ వరకు ఆన్లైన్ కేంద్రం ఉంటుంది అని అన్నారు. అదేవిధంగా సర్వోత్తం రెడ్డి ని మొదట ప్రాధాన్యత ఓటు తో గెలిపించాలని వెంకటరెడ్డి గారు కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దుద్దుకూరి సుమంత్, ఉద్యమకారుడు వేల్పుల నరసింహారావు, కొత్తూరు సర్పంచ్, హక్కుల నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కంచర్ల హరీష్, ఎస్సీ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ మోదుగు రామకృష్ణ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పోతురాజు నాగరాజు, రామ్ శెట్టి నాగేశ్వరరావు, లాకవతు రమేష్. చండ్ర వెంకటేశ్వర్లు, గోలి సిలవరాజు. మంద సురేష్. సంతపురపు ప్రవీణ్, వేల్పుల ముఖేష్. తదితరులు పాల్గొన్నారు.




