Lakshmidevipalli: లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ తాటి అనిత జన్మదిన వేడుకలు

Lakshmidevipalli: లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ తాటి అనిత జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ రాష్ట్ర నేత తూము చౌదరి; జీపీ శాప్ గుర్తింపుపై ఉప సర్పంచ్ ప్రశంస.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 22 Nov 2026 5:54 PM IST
Lakshmidevipalli
X

Lakshmidevipalli: లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ తాటి అనిత జన్మదిన వేడుకలు

లక్ష్మీదేవిపల్లి: గ్రామ సర్పంచ్ శ్రీమతి తాటి అనిత జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తూము చౌదరి సర్పంచ్ తాటి అనితతో కలిసి కేక్ కట్ చేసి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తూము చౌదరి మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ లక్ష్మీదేవిపల్లి గ్రామ అభివృద్ధికి తాటి అనిత చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

అనంతరం ఉప సర్పంచ్ పాంచనపరపు మహేష్ మాట్లాడుతూ.. సర్పంచ్ తాటి అనిత కృషితో లక్ష్మీదేవిపల్లి గ్రామానికి రాష్ట్ర స్థాయిలో జీపీ శాప్ (GP SAP – సమగ్ర అభివృద్ధి ప్రణాళిక) గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఆమె పాలనాకాలంలో గ్రామం మరింత అభివృద్ధి సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూణెం శ్రీనివాస్, మైనార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ గౌస్ పాషా, ఎండీ అఫ్సర్ ఖాన్, రెడ్డి, అంతడపుల కృష్ణ, కోటి, సీపీఐ నాయకులు అయూబ్ ఖాన్, విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు మేకల ఉపేందర్, వార్డు సభ్యులు చింత వెంకట్, ఉయ్యూరి శ్రీను, కోరేం వేణుతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM