Lakshmidevipalli: మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరుల గణేష్ ఉత్సవాలు
Lakshmidevipalli: లక్ష్మీదేవిపల్లిలో మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరుల గణేష్ ఉత్సవాలు. మొక్కలు నాటి పర్యావరణ సందేశం ఇచ్చిన ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్.
Lakshmidevipalli: మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరుల గణేష్ ఉత్సవాలు
లక్ష్మీదేవిపల్లి: లక్ష్మీదేవిపల్లిలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. గణపతి మండపంలో బాల ప్రకృతి ప్రేమికుడు, వాక్ ఫర్ ట్రీస్ వ్యవస్థాపకుడు విశ్వామిత్ర చౌహాన్ పాల్గొన్నారు.
ముస్లిం సోదరులతో కలిసి మండపం పరిసరాల్లో మొక్కలు నాటిన విశ్వామిత్ర చౌహాన్.. అనంతరం గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకృతి పరిరక్షణలో భాగంగా ప్రతిరోజూ మొక్కలు నాటుతూ చైతన్యం కల్పిస్తున్న చౌహాన్‌ను ముస్లిం సోదరులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
మతాలకు అతీతంగా ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా విశ్వామిత్ర చౌహాన్ సందేశమిచ్చారు. ముస్లిం సోదరులు గణపతి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
లక్ష్మీదేవిపల్లిలో జరిగిన ఈ కార్యక్రమం మత సామరస్యం, సోదరభావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు చక్కటి సందేశాన్ని ఇచ్చింది.




