Bhadrachalam: గోవుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి..కుంజా సంతోష్!
Bhadrachalam: భద్రాచలంలో గోవుల అక్రమ రవాణా నిందితులపై పీడీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత కుంజా సంతోష్ డిమాండ్ చేశారు.
Bhadrachalam: గోవుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి..కుంజా సంతోష్!
Bhadrachalam: గోవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కుంజా సంతోష్ పోలీసులను డిమాండ్ చేశారు. *భూదేవి, కన్నతల్లి రూపాలతో పాటు గోమాత రూపంలోనూ భూమ్మీద దుర్గామాతను చూస్తామని, అలాంటి గోవులను హింసిస్తూ అక్రమంగా రవాణా చేయడం అత్యంత పాపకార్యమని పేర్కొన్నారు.
గత ఏడు రోజులుగా పగలు, రాత్రి నిఘా ఉంచి, ఈరోజు ఉదయం 17 గోవులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించిన విశ్వహిందూ పరిషత్ (VHP), భజరంగ్ దళ్ సభ్యులు పతకమూడి లక్ష్మణ్, మేకల సిద్ధార్థ, జల్లి వెంకట్, పొదిలి శేషుకర్ణ, పులిపాటి గణేష్‌లను అభినందించారు.
చర్ల నుంచి జరుగుతున్న గోవుల అక్రమ రవాణా, ఈ వ్యవహారంలో విలేకరులు, ప్రజాప్రతినిధుల పాత్రతో పాటు, భద్రాచలం ప్రాంతంలో గోవులను హింసిస్తూ ఎడ్లబండ్ల ద్వారా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ఇంతకుముందే డీఎస్పీ గారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కేవలం వాహనాల డ్రైవర్లపైనే కాకుండా ఈ అక్రమ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి పీడీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని, నకిలీ గ్రామపంచాయతీ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా జరుగుతున్న గోవుల రవాణాను అరికట్టాలని కోరారు.
భద్రాచలం పట్టణంలో స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలను పటిష్టం చేయాలని సూచించారు. వాహనాల లోపల ఏముందో పై నుంచి గుర్తించగల ఆధునిక కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగించాలని పోలీసులను కోరారు.
శ్రీరాముని పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో భారతీయ సంస్కృతికి ప్రతీకలైన గోమాతలను రక్షించేందుకు రాజకీయ పార్టీల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని, అవసరమైతే గో సంరక్షణ కోసం ఉద్యమాలకు కూడా సిద్ధంగా ఉన్నామని కుంజా సంతోష్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుంజా ధర్మా, ములిశెట్టి రామ్మోహన్ రావు, నిడదవోలు నాగబాబు, ములిశెట్టి నిఖిల్ పాల్గొన్నారు.




