Kukkunoor: కుక్కునూరులో మొదలైన ఎంపీటీసీ నామినేషన్లు!
Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.
Kukkunoor: కుక్కునూరులో మొదలైన ఎంపీటీసీ నామినేషన్లు!
Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాలకు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాలుగు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని తెలిపారు.
నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.




