Kothagudem: కొత్తగూడెంలో బలపడుతున్న తెలంగాణ రక్షణ సేన!

Kothagudem: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పలు పార్టీల మహిళలు తెలంగాణ రక్షణ సేనలో చేరారు. టీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి. వీరన్న వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 3 Nov 2026 5:47 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో బలపడుతున్న తెలంగాణ రక్షణ సేన!

కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని ఐదు డివిజన్లకు చెందిన వివిధ పార్టీల మహిళలు మంగళవారం తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన కార్మిక విభాగం (టీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు డి. వీరన్న వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన మహిళలకు సముచిత గుర్తింపు, తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వాంకుడోత్ రవి, కార్యదర్శి ముసల రామకృష్ణ, మహిళా విభాగం నాయకురాలు గాయత్రి, విద్యార్థి విభాగం నాయకులు లకావత్ సురేష్, వేణుగోపాల్‌తో పాటు రాధిక, శిరీష, స్పందన, ఉమ, పూజిత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM