Kothagudem: టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా మురళీమోహన్ ఎన్నిక
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఎస్‌యూటీఎఫ్ 6వ మహాసభల్లో అధ్యక్షుడిగా బి. మురళీమోహన్, ప్రధాన కార్యదర్శిగా మల్లెంపాటి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Kothagudem: టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా మురళీమోహన్ ఎన్నిక
కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 6వ మహాసభలు భద్రాచలం పట్టణంలోని రెడ్డి సత్రం (రాఘవ నిలయం)లో నిర్వహించారు. ఈ సందర్భంగా 2026–2028 రెండేళ్ల కాలానికి నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షుడిగా చర్ల మండలానికి చెందిన బి. మురళీమోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్లెంపాటి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా ఎస్. మల్లారెడ్డి వ్యవహరించగా, ఎన్నికల పరిశీలకులుగా TSUTF రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, రాష్ట్ర కార్యదర్శి బి. రాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నూతన కమిటీ సమష్టిగా కృషి చేయాలని, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుండాలని సూచించారు. డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నూతన జిల్లా కమిటీ వివరాలు (2026–2028)
ఆఫీస్ బేరర్స్:
అధ్యక్షుడు: బి. మురళీమోహన్
ప్రధాన కార్యదర్శి: మల్లెంపాటి వెంకటేశ్వర్లు
ఉపాధ్యక్షులు: ఎం. రాజయ్య, ఎం. పద్మారాణి
కోశాధికారి: ఎస్. వెంకటేశ్వర్లు
జిల్లా కార్యదర్శులు: ఈ. హాథిరాం, ఎం. కృష్ణారావు, పి. జయరాజు, ఆర్. రమేష్ కుమార్, బి. రాము, డి. తావూరియా, ఎస్. విజయ్ కుమార్, ఎస్.కే. యాకూబ్ పాషా, బి. రాంబాబు, కే. గంగాధర్, ఎస్. ఆశాలత, ఎం. జానకి దేవి.
జిల్లా ఆడిట్ కమిటీ:
కన్వీనర్: ఎం. సత్యనారాయణ
సభ్యులు: ఎం. రాజేశ్వరరావు, జి. నాగేశ్వరరావు,
ఎస్. శ్రీనివాసరావు
ఆర్. ప్రసాద్, వి. బాలకృష్ణ.
సబ్ కమిటీలు, ఇతర బాధ్యతలు:
FWF సబ్ కమిటీ జిల్లా కన్వీనర్: డి. దాసు
FWF రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు: వి. వరలక్ష్మి, ఏ. వీరన్న, పి. సత్యశ్రీ, ఎస్.కే. మీరా హుస్సేన్.
VOTT కన్వీనర్: ఎం. రాందాస్
అకడమిక్ కమిటీ: కే. హరినాథ్ బాబు
మహిళా కమిటీ కన్వీనర్: ఎస్. యశోద
మహిళా కమిటీ సభ్యులు: టి. విజయలక్ష్మి, కే. అన్నపూర్ణ, చి. మంగతాయి, పాయం రాధ, ఆర్. నాగజ్యోతి.
సాంస్కృతిక కమిటీ: ఎస్. శైలజ
క్రీడా కమిటీ: బి. మంజీలాల్
సోషల్ మీడియా కమిటీ కన్వీనర్: బి. బిక్కు
సోషల్ మీడియా కమిటీ సభ్యులు: ఎం. బాలు, బి. మంగీలాల్
స్టడీ సర్కిల్ కన్వీనర్: సంక్రాంతి రవికుమార్
ఐటిడిఏ సబ్ కమిటీ కన్వీనర్: ఎం. సురేష్ బాబు
ఐటిడిఏ సబ్ కమిటీ సభ్యులు: టి. బాలు, కే. రాంబాబు, ఎం. బాలు, వై. రాఘవులు.




