Kothagudem: రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వే శాఖ

Kothagudem: కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి హేమచంద్రాపురం వరకు రోడ్డు విస్తరణకు 20 అడుగుల స్థలం కేటాయించేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని ఎమ్మెల్యే తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 16 Nov 2026 8:09 PM IST
Kothagudem
X

Kothagudem: రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వే శాఖ

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ నుంచి హేమచంద్రాపురం వరకు రహదారి విస్తరణకు మార్గం సుగమమైంది. రోడ్డు విస్తరణ కోసం రైల్వే శాఖకు చెందిన 20 అడుగుల స్థలాన్ని కేటాయించేందుకు అధికారులు అంగీకరించడం శుభపరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు.

ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ రహదారి విస్తరణ కోసం తాను రైల్వే ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు జరిపి, వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. తమ నిరంతర కృషికి ఫలితంగా రైల్వే శాఖ సానుకూలంగా స్పందించి స్థలం కేటాయించేందుకు అంగీకరించిందన్నారు.

ఇప్పటికే ఈ రహదారిని మరింత సుందరంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.కోటి నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. రైల్వే స్థలం అందుబాటులోకి రావడంతో రోడ్డు విస్తరణ పనులకు మరింత ముందడుగు పడిందన్నారు.

విస్తరణ పనులు పూర్తయితే రైల్వే స్టేషన్ నుంచి హేమచంద్రాపురం మార్గంలో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతో పాటు వాహనదారులు, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని కూనంనేని ఆశాభావం వ్యక్తం చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM