Kothagudem: ముగ్గురు వికలాంగ పిల్లలతో తల్లి గోడు: అధికారి మానవత్వం

Kothagudem: భూ సమస్యపై కొత్తగూడెం కలెక్టరేట్‌కు వచ్చిన ముగ్గురు వికలాంగ పిల్లల వృద్ధ తల్లి దీనస్థితిపై అధికారి లెనీనా మానవతా దృక్పథంతో స్పందించి సాయం అందించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 21 Sept 2026 4:41 PM IST
Kothagudem
X

Kothagudem: ముగ్గురు వికలాంగ పిల్లలతో తల్లి గోడు: అధికారి మానవత్వం

కొత్తగూడెం: భూ సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చిన ఓ వృద్ధ తల్లి, తన ముగ్గురు వికలాంగ పిల్లల పరిస్థితి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఇల్లందు మండలం రాఘబోయినగూడెం గ్రామానికి చెందిన ఈసం కన్నమ్మ తన ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్‌కు వచ్చింది. ముగ్గురు పిల్లలూ మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్నారు.

భూ సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చిన కుటుంబాన్ని చూసిన వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి లెనీనా వారి పరిస్థితికి చలించిపోయారు. వెంటనే వారిని తన కార్యాలయానికి తీసుకెళ్లి వారి అవసరాలను తెలుసుకున్నారు. అనంతరం రెండు టాయిలెట్ సైకిళ్లను అందజేశారు. వీల్‌చైర్లను కూడా త్వరలో అందజేస్తామని తెలిపారు.

తన ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తూ సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వచ్చిన వృద్ధ తల్లి పరిస్థితిపై అధికారి స్పందించి తక్షణ సహాయం అందించడం పలువురి ప్రశంసలు అందుకుంది.

ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి లెనీనాను అభినందించారు. బాధిత కుటుంబానికి భూ సమస్యను కూడ పరిష్కరించాలని కోరారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM