Kothagudem: డీవైఎఫ్‌ఐ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా ధరావత్ శివ ఎన్నిక!

Kothagudem: డీవైఎఫ్‌ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ ఎన్నిక. అధ్యక్షుడిగా ధరావత్ శివ, కార్యదర్శిగా లకావత్ కుమార్. నిరుద్యోగంపై పోరాటాలకు పిలుపు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 17 Oct 2026 8:35 PM IST
Kothagudem
X

Kothagudem: డీవైఎఫ్‌ఐ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా ధరావత్ శివ ఎన్నిక!

కొత్తగూడెం: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడవ మహాసభ శుక్రవారం కొత్తగూడెంలోని టీచర్స్ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభ ప్రతినిధులు జిల్లా నూతన కమిటీని ఎన్నుకోగా, అనంతరం కిషోర్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కమిటీ వివరాలను డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాళంగి హరికృష్ణ ప్రకటించారు.

నూతన జిల్లా అధ్యక్షుడిగా ధరావత్ శివ, ప్రధాన కార్యదర్శిగా లకావత్ కుమార్, కోశాధికారిగా చింతలపూడి శ్రావణి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సండ్ర భూపేంద్ర, గణేష్, బాలాజీ, వీరబాబు, సహాయ కార్యదర్శులుగా స్వరూప, చిట్టి, సుధీర్, శ్రీకాంత్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా రాంబాబు, చిమట నరేష్, హర్ష, పవన్, బడుగుల శివ, కిషోర్, సుజిత్, సాంబశివరావు బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ నాయకులు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా డీవైఎఫ్‌ఐని బలోపేతం చేసి, యువతను పెద్ద సంఖ్యలో సంఘంలోకి తీసుకువస్తామని తెలిపారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీ, నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాల కల్పన, యువతకు నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై ఉద్యమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

యువత సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేపడతామని, యువజన హక్కుల సాధనతో పాటు ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా చైతన్య కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, ఇతర యువజన సంఘాలను కలుపుకొని సామాజిక కార్యక్రమాలను విస్తృతం చేస్తామని నూతన కమిటీ నాయకులు వెల్లడించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM