Kothagudem: లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, చెక్కులు పంపిణీ
Kothagudem: కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు.
Kothagudem: లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, చెక్కులు పంపిణీ
కొత్తగూడెం: తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తోందని పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ షెడ్యూల్డ్ తెగల (ST) సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు అన్నారు.
అశ్వాపురం మండలంలోని రైతు వేదిక నందు నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ షెడ్యూల్డ్ తెగల (ST) సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మండలంలోని 24 గ్రామపంచాయతీలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 23 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ షెడ్యూల్డ్ తెగల (ST) సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పౌర సరఫరాలు, ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత సులభతరం అవుతోందని తెలిపారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ షెడ్యూల్డ్ తెగల (ST) సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా 23 మంది లబ్ధిదారులకు రూ.1,00,116 చొప్పున ఆర్థిక సహాయం అందించడం పేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తోందని పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ఆడబిడ్డల వివాహ సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా తన వంతు కృషి చేస్తానని పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ షెడ్యూల్డ్ తెగల (ST) సంక్షేమ కమిటీ చైర్మన్ శ్రీ పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, MRO, మండల అధ్యక్షులు ఓరుగంటి రమేష్ బాబు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




