Kothagudem: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఎమ్మెల్యే

Kothagudem: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 15 Oct 2026 5:35 PM IST
Kothagudem
X

Kothagudem: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఎమ్మెల్యే

కొత్తగూడెం: అగ్రిగోల్డ్ బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు ఉద్యమ పోరాటాలను కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.

గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని శేషగిరి భవన్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి అగ్రిగోల్డ్ బాధితుల విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

రైతులు, చిరువ్యాపారులు, పేద కుటుంబాలు తమ కష్టార్జితాన్ని పొదుపు చేసుకోగా, అగ్రిగోల్డ్ సంస్థ కారణంగా మోసపోయారని ఆయన పేర్కొన్నారు. ఏళ్లు గడుస్తున్నా బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగకపోవడం ఆందోళనకరమని అన్నారు.

లక్షలాది మంది బాధిత కుటుంబాలు, ఏజెంట్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ సమస్య పరిష్కారంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాధితులకు చెల్లింపులు చేయాలని డిమాండ్

అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన ఆస్తులను విక్రయించి బాధితులకు బకాయిలు చెల్లించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సంస్థకు సంబంధించిన బినామీ ఆస్తులను గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.

బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM