Kothagudem: విజయ విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి
Kothagudem: కొత్తగూడెం గణేష్ టెంపుల్‌లో విజయ విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష.
Kothagudem: విజయ విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని పలు వినాయక మండపాల సందర్శనలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గణేష్ టెంపుల్‌లోని విజయ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవాదాయ శాఖ అధికారులు ఆలయ ఈవో రజనీకుమారి, పూజారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాలను తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు. వినాయకుడిని హిందువులతో పాటు సర్వమతాల ప్రజలు భక్తిశ్రద్ధలతో కొలుస్తారని పేర్కొన్నారు.
విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించే స్వామిగా, భక్తులు కోరిన కోరికలను నెరవేర్చే దైవంగా ప్రజలు విశ్వసిస్తారని మంత్రి అన్నారు. కొత్తగూడెంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
విజయ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ, ఆళ్ళ మురళి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ వై. శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొదుమూరి శ్రీనివాస్, పల్లపోతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




