Kothagudem: బోల్తా పడిన పాల వ్యాన్.. రోడ్డుపై చెల్లాచెదురైన ప్యాకెట్లు
Kothagudem: కొత్తగూడెం హెడ్ ఆఫీస్ సమీపంలో తెల్లవారుజామున పాల వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి.
Kothagudem: బోల్తా పడిన పాల వ్యాన్.. రోడ్డుపై చెల్లాచెదురైన ప్యాకెట్లు
Kothagudem: పట్టణంలోని హెడ్ ఆఫీస్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున పాల వ్యాన్ బోల్తా పడింది. పాలు లోడుతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి రహదారి పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న పాల ప్యాకెట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యాన్‌లో చిక్కుకున్న డ్రైవర్, క్లీనర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఇద్దరికీ స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.




