Kothagudem: ఘనంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోస్టర్ ఆవిష్కరణ
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోగో, మస్కట్ పోస్టర్ను అదనపు కలెక్టర్లు ఆవిష్కరించి, క్రీడాకారులను ప్రోత్సహించారు.
Kothagudem: ఘనంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోస్టర్ ఆవిష్కరణ
కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి సూచన మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు తేదీ: 16-11-2026 న జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నందు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోగో మరియు మస్కట్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.
- పాల్గొన్న అధికారులు: ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీమతి విద్యాధనన గారు, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీమతి వి.అనూష గారు, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.
- ఢిల్లీలో ఆవిష్కరణ: 15-11-2026 న గౌరవనీయులు కేంద్ర స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీ డా. మన్సుఖ్ మాండవీయ గారు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ కె. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీ వాకాటి శ్రీహరి గారి చేతుల మీదుగా ఢిల్లీలో ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు.
- గేమ్స్ నిర్వహణ: డిసెంబర్ 11 నుండి 22వ తారీకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో జిల్లా వాస్తవంగా క్రీడాకారులు అన్ని క్రీడాంశాలలో పాల్గొని ప్రతిభ కనపరిచి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు.
- సర్టిఫికెట్ ప్రయోజనం: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సర్టిఫికెట్ కు భవిష్యత్తులో మంచి ప్రాధాన్యత ఉన్నందున క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
- అవగాహన కార్యక్రమం: జిల్లా వ్యాప్తంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పట్ల అవగాహన కల్పించాలని, స్కూల్స్, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మా కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రధాన కూడలిలో, బస్టాండ్ ఆవరణలో, ప్రజా సంచార ప్రదేశాలలో సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించాలని సంబంధిత శాఖ వారిని ఆదేశించారు.




