Kothagudem: కొత్తగూడెం జనసేన ఆఫీస్‌లో ఘనంగా అట్ల బతుకమ్మ!

Kothagudem: కొత్తగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో డాక్టర్ జీఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అట్ల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. పాల్గొన్న మహిళలకు పట్టుచీర, బహుమతులు అందజేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 14 Oct 2026 9:17 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం జనసేన ఆఫీస్‌లో ఘనంగా అట్ల బతుకమ్మ!

కొత్తగూడెం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు కొత్తగూడెం విద్యానగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. డాక్టర్ జీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధినేత, జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రతినిధి, ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో భాగంగా బుధవారం అట్ల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.

మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయబద్ధంగా అట్లతో పాటు వివిధ రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలతో సందడి చేశారు.

తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో పాల్గొనే మహిళలకు ప్రతిరోజూ బహుమతులు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ఒకరికి పట్టుచీర, మరో ఐదుగురికి కన్సొలేషన్ బహుమతులు అందించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ మహిళల్లో ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM