Kothagudem: కొత్తగూడెం జామియా మసీద్‌లో ఘనంగా గ్యార్వీ వేడుకలు
Kothagudem: కొత్తగూడెం జామియా మసీద్‌లో ఏఎస్జే ఆధ్వర్యంలో గ్యార్వీ వేడుకలు ఘనంగా జరిగాయి. డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Kothagudem: కొత్తగూడెం జామియా మసీద్‌లో ఘనంగా గ్యార్వీ వేడుకలు
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని జామియా మసీద్‌లో అహ్లే సున్నత్ వల్ జమాత్ (ASJ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్యార్వీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, ఆళ్ల మురళి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ASJ కమిటీ గౌరవ ఛైర్మన్ ఎం.ఏ. రజాక్, ఛైర్మన్ మహమ్మద్ గౌస్ మొహినుద్దీన్, వైస్ ఛైర్మన్ షేక్ కరీం ఖాద్రీ, అధ్యక్షుడు మహమ్మద్ యూసుఫ్, ఉపాధ్యక్షుడు షేక్ యాకూబ్ ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ హుస్సైన్ ఖాన్, కోశాధికారి సయ్యద్ యాకూబ్ ఉద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అన్వర్ పాషా, అధికార ప్రతినిధి న్యాయవాది మహమ్మద్ సాదిక్ పాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ నయీమ్ చిష్తీ, మదీనా అక్తర్ పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొత్తగూడెం ముస్లిం మైనార్టీ నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు హాజరయ్యారు. ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమంతో గ్యార్వీ వేడుకలు కొనసాగాయి.




