Kothagudem: 106 ఆరోగ్య సూచికల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి
Kothagudem: రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య సంస్థల్లో 106 ఆరోగ్య సూచికలను సమర్థవంతంగా అమలు చేయాలని CH&FW కమిషనర్ ముషారఫ్ ఆలీ ఫారుకి అధికారులను ఆదేశించారు.
Kothagudem: 106 ఆరోగ్య సూచికల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి
కొత్తగూడెం: ఈరోజు రాష్ట్ర కమిషనర్, CH&FW రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ MD ముషారఫ్ ఆలీ ఫారుకి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య సంస్థల్లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన 106 ఆరోగ్య సూచికలను (Health Indicators) నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యం, పోషకాహారం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంపు, గర్భిణులకు మరియు చిన్నారులకు సకాలంలో వ్యాక్సినేషన్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు HPV టీకా కార్యక్రమం, SNCU కేంద్రాలు, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ల (NRC) నిర్వహణ, RBSK ద్వారా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు, కిశోర బాలికల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
అదేవిధంగా అసంక్రమిక వ్యాధుల నివారణ, క్యాన్సర్ స్క్రీనింగ్, గుండె జబ్బుల గుర్తింపు, మలేరియా, డెంగ్యూ, క్షయ వ్యాధి నిర్మూలన, టిబి ముక్త్ భారత్ అభియాన్, HIV/AIDS, కుష్టు వ్యాధి నియంత్రణ, తెలంగాణ డయాగ్నస్టిక్స్, 102, 104, 108 అత్యవసర సేవలు, ఈ-సంజీవని, టెలిమనాస్mmu యూనిట్ సేవలు,IDSP అందత్వ నివారణ,abha అప్డేషన్, మీ ప్రమాణం వంటి కార్యక్రమాలకు సంబంధించిన సూచికలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మలేరియా విభాగంలో, అలాగే ప్రభుత్వ మరియు ,ప్రైవేటు ఆసుపత్రుల నుంచి HMIS పోర్టల్‌లో నివేదికల సమర్పణలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచినందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కమిషనర్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
అదేవిధంగా కొన్ని ఆరోగ్య సూచికల్లో జిల్లా వెనుకబడి ఉన్నందున సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, రాబోయే సమావేశం నాటికి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.
ఈ జూమ్ సమావేశంలో అదనపు DMHO డాక్టర్ సైదులు, డిప్యూటీ DMHO భద్రాచలం డాక్టర్ శ్రీధర్, డిప్యూటీ DMHO కొత్తగూడెం డాక్టర్ ప్రతాప్, NCD ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ దినేష్, TB ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, MHN ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాకేష్,PODTT ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రామ్ దాస్, డిప్యూటీ DEMO నాగలక్ష్మి, HEO హరి, తెలంగాణ డయాగ్నొస్టిక్ కోఆర్డినేటర్ నిజాముద్దీన్, ఎబినైజర్, 102 కోఆర్డినేటర్ సతీష్, NHM DDM రెహ్మాన్, IDSP-DDM శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




