Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక ఆర్థిక అవగాహన శిబిరాలు

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్థిక అవగాహన శిబిరాలు ప్రారంభం. అనంతారంలో బ్యాంకింగ్, సైబర్ భద్రత, బీమా పథకాలపై ప్రజలకు లీడ్ బ్యాంక్ అవగాహన.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 22 Oct 2026 6:19 PM IST
Kothagudem
X

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక ఆర్థిక అవగాహన శిబిరాలు

కొత్తగూడెం: జూలూరుపాడు మండలం అనంతారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన శిబిరంలో బ్యాంకులు అందిస్తున్న వివిధ సేవలు, కె. వై.సి. అప్డేట్ చేసుకోవడం, ఉపయోగంలో లేని ఖాతాల పునరుద్ధరణ, ప్రధాన మంత్రి జీవన జ్యోతి, ప్రధాన మంత్రి సురక్ష భీమా పథకాలు, అటల్ పెన్షన్ యోజన పథకం, పొదుపు పథకాలు, డిజిటల్ లావాదేవీల అవశ్యకత, సైబర్ మోసాలకు గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, సైబర్ మోసం జరిగినపుడు 1930 టోల్ ఫ్రీ నంబర్ ఉపయోగం, కిసాన్ క్రెడిట్ కార్డు, క్లెయిమ్ చేయని డిపాజిట్లు, వాటిని తిరిగి తీసుకునే విధానం, రుణాల సక్రమ చెల్లింపు వల్ల కలిగే ఉపయోగాలు, నామినేషన్ సౌకర్యం తదితర వివరాలు తెలియ చేశారు. ప్రజలు అడిగిన వివిధ సందేహాలు నివృత్తి చేశారు.

కస్టమర్ సర్వీస్ పాయింట్ సిబ్బంది ఆసక్తి గల ఖాతాదారులకు భీమా పథకాలలో నమోదు చేసి, సర్టిఫికెట్ లు అందించారు. డిసెంబర్ 31 లోగా జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ లో కనీసం ఒక శిబిరం నిర్వహించే విధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో మరియు అన్ని బ్యాంక్ శాఖలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో కృషి చేస్తున్నట్లుగా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి తెలియచేశారు. ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ పి.జి.ఎన్.శర్మ, ఎం.పి.డి.ఓ. టి. రవి, సర్పంచ్ రమేష్, పంచాయతీ కార్యదర్శి శైలజ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలూరుపాడు మేనేజర్ ప్రవీణ్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గుండెపూడి మేనేజర్ వెన్నెల , పే పాయింట్ కస్టమర్ సర్వీస్ పాయింట్ జిల్లా సమన్వయ కర్త కిషోర్, సి.ఎఫ్.ఎల్. సిబ్బంది నాగరాజు తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU