Kothagudem: మానవతా విలువల ప్రతీక గురునానక్ బోధనలు: ఎస్ కె సాబీర్ పాషా!

Kothagudem: మతసామరస్యం, సమానత్వం, మానవతా విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు గురునానక్ దేవ్ అని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా కొనియాడారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 25 Nov 2026 7:15 AM IST
Kothagudem
X

Kothagudem: మానవతా విలువల ప్రతీక గురునానక్ బోధనలు: ఎస్ కె సాబీర్ పాషా!

కొత్తగూడెం: మతసామరస్యం, సమానత్వం, మానవతా విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు గురునానక్ దేవ్ అని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా కొనియాడారు. సిక్కు మత వ్యవస్థాపకులు గురునానక్ దేవ్ 555వ జయంతి వేడుకలను పురస్కరించుకుని కొత్తగూడెం పట్టణంలోని దుర్జన్ బస్తీలో ఉన్న గురుద్వారా గురునానక్ సాహెబ్ దేవాలయంలో మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు, వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాబీర్ పాషా గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, నిర్వాహకులకు మరియు సిక్కు సోదరులకు జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందన్నారు. అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం గురునానక్ చూపిన మార్గం నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు.

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, పేదలకు సేవ చేయడమే నిజమైన దైవారాధన అని ఆయన బోధించారని గుర్తుచేశారు. లౌకికవాద పునాదులను బలోపేతం చేస్తూ, శాంతియుత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. మతాల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గురుద్వారా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీనివాస్, పున్నం సింగ్, సికిందర్ సింగ్, బుషి, గోవింద్ సింగ్, పవన్ సింగ్, బల్వాన్ సింగ్, శంకర్ సింగ్, ప్రేమ్ సింగ్, బహద్దూర్ సింగ్, సోను సింగ్, హాబీద్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM