Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా జిల్లా స్థాయి యువ కళాకారుల ఎంపిక పోటీలు

Kothagudem: కొత్తగూడెం క్లబ్‌లో 30వ జాతీయ యువజనోత్సవాల జిల్లా ఎంపిక పోటీలు ఘనంగా జరిగాయి. 550 మందికి పైగా కళాకారులు పాల్గొనగా విజేతలకు అవార్డులు అందజేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 6 Nov 2026 8:37 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా జిల్లా స్థాయి యువ కళాకారుల ఎంపిక పోటీలు

కొత్తగూడెం: 30వ జాతీయ యువజనోత్సవాల సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువ కళాకారుల ఎంపిక పోటీలు శుక్రవారం స్థానిక కొత్తగూడెం క్లబ్, కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు.

ఈ పోటీలలో జిల్లా వ్యాప్తంగా 15 నుండి 29 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సామూహిక, వ్యక్తిగత విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలలో 550 మందికి పైగా యువ కళాకారులు పాల్గొనడం విశేషం. ఈ పోటీలలో భాగంగా సామూహిక విభాగాల్లో జానపద నృత్యాలు, జానపద గేయాలు, వీధి నాటకం, వ్యక్తిగత విభాగాల్లో పెయింటింగ్, కవిత్వం తదితర అంశాల్లో యువ కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ హాజరై, స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతిప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, యువత మంచి మార్గంలో నడవాలని, మత్తు, మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి సమాజ స్థాపన కొరకు కృషి చేయాలని, యువ కళాకారులు జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో కూడా విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.

విజేతల వివరాలు:

1 జానపద నృత్యాలు TGSWRDC, కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కళాశాల, కొత్తగూడెం TGSWRDC, కొత్తగూడెం

2 జానపద గేయాలు E.M.R.S, గుండాల అగ్రికల్చరల్ కళాశాల, అశ్వారావు పేట సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాల, కొత్తగూడెం

3 వీధి నాటకం TGSWRDC, పాల్వంచ TGSWRDC, కొత్తగూడెం అగ్రికల్చరల్ కళాశాల, అశ్వారావు పేట

4 పెయింటింగ్ శ్రద్ధ పటేల్ (సింగరేణి Jr. ఉమెన్స్ కళాశాల, కొత్తగూడెం) హౌమిక (అగ్రికల్చరల్ కళాశాల, అశ్వారావు పేట) అఖిల్ (T.G.M.R.S & JC, కొత్తగూడెం)

5 కవిత్వం జి. క్రాంతి కుమార్ (అగ్రికల్చరల్ కళాశాల, అశ్వారావు పేట) పే. నజ్మీన్ (సింగరేణి Jr. ఉమెన్స్ కళాశాల, కొత్తగూడెం) పి. వరలక్ష్మి గవర్నమెంట్ జూనియర్ కళాశాల, పాల్వంచ

విజేతలకు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి శ్రీమతి బి.అనుష సామూహిక మరియు వ్యక్తిగత విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి సర్టిఫికేట్స్ & మెమెంటోతో సత్కరించారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన కళాకారులు రాష్ట్ర స్థాయి యువజన ఉత్సవాల్లో పాల్గొంటారు, అక్కడ ప్రతిభ కనబరిచి ఎంపికైన కళాకారులు 2027 జనవరి 10 నుండి 12 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి యువజన ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం పొందుతారని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి శ్రీమతి బి.అనుష తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి శ్రీమతి బి.అనుష మరియు సంబంధిత శాఖ సిబ్బంది బి.తిరుమలరావు, పులి లక్ష్మయ్య, న్యాయనిర్ణేతలు బాలు, రాజేష్, హుస్సేన్, షేక్ మూసా, కార్యాలయ కో-ఆర్డినేటర్ అబ్దుల్ నబి, కళ్యాణ్, మల్లిఖార్జున్, నాగేందర్, డేనియల్ రాంబాబు, కళాకారులు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM