Kothagudem: తెలంగాణ మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలి కూనంనేని సాంబశివరావు!

Kothagudem: ఎల్ నినో ప్రభావంతో తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్. నవంబర్ 3, 4న పర్యటన.

G. Govind
Published on: 28 Oct 2026 4:15 PM IST
Kothagudem
X

Kothagudem: తెలంగాణ మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలి కూనంనేని సాంబశివరావు!

Kothagudem: ఎల్ నినో పేరుతో కరువు విలయ తాండవం చేస్తోంది. రాజకీయంగా ఒకరిపైనన ఒకరూ బురద జల్లుకోవడం మానేసి దీని నుంచి ఎట్లా బయటపడాలో ఆలోచించాలి, కరువు అనేది ప్రపంచ వ్యాప్తంగా సంభవించింది.

కరువును కొన్ని మండలాలకే పరిమితం చేయకూడదు, తెలంగాణ మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలి, బియ్యం ధర, నీళ్ల ట్యాంకర్ ధరలు ఇప్పుడే పెరిగిపోయాయి, ఎక్కడైనా అక్రమంగా నిల్వ చేస్తే సీపీఐ కరువు దాడులు చేస్తోంది.

పేద ప్రజలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తుంది. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. కరువు పరిస్థితిని పరిశీలించేందుకు నవంబర్ 3, 4 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో పర్యటిస్తాం.

బ్రెజిల్ లో కమ్యూనిస్టులు మళ్లీ గెలిచారు. ప్రపంచ దేశాల్లో కమ్యూనిస్టులు గెలుస్తున్నారు,

ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ తొండిగా వ్యవహరించింది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు కోరాయి,

సీపీఐ నుంచి కూడా పోటీ చేయాలనే ఆలోచన ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత పోటీ చేయాలా వద్దా అనేది తెలుస్తుంది.

G. Govind

G. Govind