Kothagudem: స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడమే నా లక్ష్యం: విశ్వామిత్ర చౌహాన్!

Kothagudem: కొత్తగూడెం బస్టాండ్‌లో వనజీవి విశ్వామిత్ర చౌహాన్ 1616వ మొక్కగా పింక్ పనస నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 4 Nov 2026 8:35 PM IST
Kothagudem
X

Kothagudem: స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడమే నా లక్ష్యం: విశ్వామిత్ర చౌహాన్!

కొత్తగూడెం, నవంబర్ 4: కొత్తగూడెం బస్టాండ్ ఆవరణలో 1616వ మొక్కగా పింక్ పనస మొక్క నాటిన వనజీవి విశ్వామిత్ర చౌహాన్, పర్యావరణ పరిరక్షణే తన బాధ్యతగా భావిస్తూ ప్రతిరోజూ "వాక్ ఫర్ ట్రీస్" కాన్సెప్ట్ తో మొక్కలు నాటుతున్న విశ్వామిత్ర చౌహాన్, ఈ కార్యక్రమంలో టీఎస్ టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని విశ్వామిత్రతో కలిసి మొక్క నాటారు.

ఈ సందర్భంగా విశ్వామిత్ర చౌహాన్ మాట్లాడుతూ - "స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడమే నా జీవిత లక్ష్యం. చెట్టు నాటడం అంటే కేవలం మొక్క నాటడం కాదు, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువును అందించడం. ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క మొక్క నాటినా చాలు, మన భూమి మళ్లీ పచ్చగా మారుతుంది" అని అన్నారు. కార్యక్రమంలో పునకుల ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బాదావత్ శ్రీహరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాస్, బండి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM