Kothagudem: కొత్తగూడెంలో 139వ మన్ కీ బాత్ వీక్షణ
Kothagudem: కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ప్రధాని 139వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు.
Kothagudem: కొత్తగూడెంలో 139వ మన్ కీ బాత్ వీక్షణ
కొత్తగూడెం: పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 139వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు వీక్షించారు. పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగాన్ని నాయకులు ఆసక్తిగా వీక్షించారు. మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో పంచుకున్న సందేశాలు, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆదిమూల రాములు, నోముల రమేష్, కె. శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి చంద్రగిరి రమేష్, పట్టణ నాయకులు భాస్కర్ గౌడ్, రవికిరణ్, శ్రీకాంత్, గిరి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.




