Kothagudem: మెండు రాజమల్లుకు న్యాయ సేవా రత్న అవార్డు ప్రదానం

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం న్యాయవాది, సామాజిక సేవకుడు మెండు రాజమల్లుకు తిరుపతిలో న్యాయ సేవా రత్న అవార్డు లభించింది. 41వ వివాహ వార్షికోత్సవ వేళ విశేషం.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 29 Nov 2026 5:58 PM IST
Kothagudem
X

Kothagudem: మెండు రాజమల్లుకు న్యాయ సేవా రత్న అవార్డు ప్రదానం

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన న్యాయవాది, సామాజిక సేవకుడు మెండు రాజమల్లు ‘డాక్టరేట్ – న్యాయ సేవా రత్న’ అవార్డుకు ఎంపికయ్యారు. సమాజానికి అందించిన న్యాయ సేవలు, సామాజిక సేవలను గుర్తిస్తూ అమెరికన్ యూనివర్సిటీ గ్లోబల్ లీడర్స్ అండ్ విజనరీస్ కాంక్లేవ్–2026 తరఫున ఈ పురస్కారాన్ని అందజేశారు.

నవంబర్ 29న తిరుపతిలోని హోటల్ రెగాలియాలో నిర్వహించిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలందించిన 126 మంది ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. సంస్థ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ కె. వెంకటేష్ చేతుల మీదుగా మెండు రాజమల్లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

కొత్తగూడెం కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేస్తూ, లీగల్ సర్వీసెస్ సభ్యుడిగా వివిధ హోదాల్లో ప్రజలకు న్యాయ సేవలు అందించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోనూ పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. యునైటెడ్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ ఏరియా, బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లో నిరుపేదలకు అన్నదానం చేశారు. అలాగే పాల్వంచలోని నిరాశ్రయులకు నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో దుప్పట్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేశారు.

ఇలా న్యాయ, సామాజిక సేవా రంగాల్లో మెండు రాజమల్లు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మరో విశేషమేమిటంటే.. అవార్డు అందుకున్న రోజే మెండు రాజమల్లు దంపతుల 41వ వివాహ వార్షికోత్సవం కావడం విశేషం.

ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్, రవి, డాక్టర్ వనజాక్షి, కార్డియాలజీ సర్జన్, ఎస్.వి. యూనివర్సిటీ హెచ్‌ఓడీ, చక్రధర సిద్ధాంతి, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాస్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మెండు రాజమల్లు అవార్డు అందుకోవడంపై పలువురు అభినందనలు తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM