Khammam: ఖమ్మంలో జూనియర్ బాలికల అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోస్టర్ ఆవిష్కరణ

Khammam: ఖమ్మంలో 48వ జూనియర్ బాలికల అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను ఆవిష్కరించిన తుమ్మల యుగేందర్. అక్టోబర్ 31 నుండి సర్దార్ పటేల్ స్టేడియంలో పోటీలు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 22 Oct 2026 5:45 PM IST
Khammam
X

Khammam: ఖమ్మంలో జూనియర్ బాలికల అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోస్టర్ ఆవిష్కరణ

ఖమ్మం: ఖమ్మం జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 48వ జూనియర్ బాలికల అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్–2026 పోస్టర్‌ను తుమ్మల గారి క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగేందర్ గారు ఆవిష్కరించారు.

ఈ పోటీలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2, 2026 వరకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. తెలంగాణ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ (DYSO), తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సహకారంతో ఈ ఛాంపియన్‌షిప్ జరగనుంది.

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ క్రీడాకారిణులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మంచి అవకాశం లభించనుంది. పోటీల విజయవంతమైన నిర్వహణకు ఖమ్మం జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వర రావు గారు, ఖాదర్ బాబు ,హనుమంత్ రావు గారు, కృష్ణ మోహన్ గారు తదితర కాంగ్రెస్ నాయకులు మరియు *ఖమ్మం జిల్లా హ్యాండ్బాల్ జనరల్ సెక్రెటరీ వరికుటి మోహన్ గారు*సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.